పన్ను నొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.
మత్తుమందు ఇచ్చి..
గతనెల 16న పన్ను నొప్పి కారణంగా బాధితురాలు స్థానిక డెంటల్ క్లీనిక్‌కి వెళ్లింది. పన్ను తొలగించాలని డెంటిస్ట్ చెప్పాడు. ఆ తర్వాత బాధితురాలికి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమె పన్ను తొలగించాడు. ఆ వెంటనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.
స్పృహలోకి వచ్చిన బాధితురాలిని అతడు బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. వీడియోను బయటపెడతానని చెప్పాడు.
భర్త ఫిర్యాదుతో..
కొద్ది రోజుల తర్వాత ఈ విషయం బాధితురాలి భర్తకు తెలిసింది. ఈ ఘటనపై ఈనెల 3న బాధితురాలి భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి :మొబైల్లో పోర్న్ చూసి.. 10 రోజుల్లో ముగ్గురు బాలికలపై..