kavitha reddy congress karnataka: మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఆ పార్టీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి తప్పుపట్టారు. 50 శాతం ఉన్న మహిళలను కాంగ్రెస్ విస్మరిస్తోందని ఆరోపించారు. మహిళలకు రాజకీయాల్లో, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా.. సామాజిక న్యాయం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. జూన్ 3న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో మహిళలకు స్థానం కల్పిచకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు.
"టికెట్ పొందిన పురుషులు అందరూ గెలవలేరు. అదే మహిళల విషయానికి వస్తే గెలుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రకాల వనరులు ఉండి పురుషులు ఓడిపోతున్నారు. దీనిపై పురుషులను ప్రశ్నించకుండా కేవలం మహిళలనే ప్రశ్నిస్తున్నారు. 50 శాతం ఉన్న జనాభాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరిస్తోంది. శాసనసభ, మండలి,పార్లమెంట్ల్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. అంటే అర్థం మహిళలకు వీటిలో ప్రవేశం లేదా?"