మహారాష్ట్ర ముంబయిలో డెల్టా ప్లస్(Delta Plus) వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముంబయికి చెందిన ఓ 63 ఏళ్ల వృద్ధురాలు.. రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ సోకి మృతిచెందారు.
ముంబయిలో డెల్టా ప్లస్‌తో మృతిచెందిన మొదటి మహిళ ఈమే అని అధికారులు నిర్ధరించారు. తొలుత.. వృద్ధురాలు జులై 21న కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. పొడి దగ్గు, ఒంటినొప్పులు, రుచి కోల్పోవడం మొదలైన లక్షణాలు రోగిలో కనిపించాయని పేర్కొన్నారు. ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ఆమె జులై 27న మరణించినట్లు స్పష్టం చేశారు.