తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'80% కరోనా కేసులకు ఆ వేరియంటే కారణం' - డెల్టా ప్లస్​ వేరియంట్​

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80శాతానికి పైగా కేసులకు డెల్టా వేరియంటే కారణమని సార్స్ ​కొవ్​- జీనోమ్ కన్సార్టియమ్ అధిపతి ఎన్​కే అరోడా తెలిపారు. ఆల్ఫా వేరియంట్​ కన్నా ఈ వేరియంట్​ 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. మరోవైపు.. 11 రాష్ట్రాల్లో డెల్డా ప్లస్​ వేరియంట్ కేసులు వెలుగు చూశాయని వెల్లడించారు.

delta variant
డెల్టా వేరియంట్​

By

Published : Jul 19, 2021, 2:43 PM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభణకు కారణమైన డెల్టా వేరియంట్​ గురించి కీలక విషయాలు వెల్లడించారు సార్స్​ కొవ్​-2 జీనోమ్​ కన్సార్టియమ్​ అధిపతి డాక్టర్​ ఎన్​కే. అరోడా. దేశంలో కొత్తగానమోదవుతున్న కరోనా కేసుల్లో 80శాతానికిపైగా కేసులకు ఈ వేరియంటే కారణమవుతోందని చెప్పారు. అంతకుముందు ఉన్న అల్ఫా వేరియంట్​ కన్నా డెల్టా వేరియంట్​.. 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్​, సింగపూర్ సహా 80 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించిందని పేర్కొన్నారు.

"బి.1.617.2 వేరియంట్​(డెల్టా వేరియంట్​)ను గతేడాది అక్టోబర్​లో తొలిసారి గుర్తించారు. దేశంలో రెండో దశ కరోనా విజృంభణకు ఈ వేరియంట్​ వ్యాప్తే కారణంగా మారింది. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం కేసులకు ఈ వేరియంటే కారణం. డెల్టా వేరియంట్​ స్పైక్​ ప్రొటీన్​ ఉత్పరివర్తనాలు.. కణాల ఉపరితలంతో ఉండే ఏసీఈ2 గ్రాహకాలతో తొందరగా కలిసిపోతోంది. తద్వారా వైరస్​ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటోంది."

- ఎన్​కే అరోడా, సార్స్​ కొవ్​-2 జీనోమ్​ కన్సార్టియమ్​ అధిపతి

అయితే.. డెల్టా వేరియంట్​ కారణంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పడం కష్టమని ఎన్​కే అరోడా పేర్కొన్నారు. వయసులవారీ కరోనా మరణాలు.. ఒకటో దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ ఉన్నాయని చెప్పారు. డెల్టా ప్లస్​ వేరియంట్​లోని ఏవై.1, ఏవై.2 రకాలు.. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్​ సహా 11 రాష్ట్రాల్లో 55 నుంచి 60 కేసులు వెలుగు చూశాయని అరోడా వివరించారు. నేపాల్​, పోర్చుగల్, స్విట్జర్లాండ్​, జపాన్​ వంటి దేశాల్లోనూ డెల్టా ప్లస్​ వేరియంట్​ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్​పై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

టీకాల మాటేమిటి?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు.. డెల్టా వేరియంట్​ను సమర్థంగా ఎదుర్కోగలవని డాక్టర్​ ఎన్​కే అరోడా స్పష్టం చేశారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతోందని చెప్పారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో డెల్టా వేరియంట్​ విజృంభణ కొనసాగుతోందన్నారు. మరిన్ని వేరియంట్​లు వ్యాపిస్తే.. దేశంలో కరోనా కేసులు పెరగవచ్చని.. అది తరువాతి దశ ఉద్ధృతికి దారితీయవచ్చని హెచ్చరించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించి, వ్యాక్సిన్​ తీసుకుంటేనే భవిష్యత్​లో వచ్చే కరోనా వేవ్​లను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

శ్రీలంకలోనూ డెల్టా కలకలం

శ్రీలంకలోనూ కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో 30 శాతం డెల్టా వేరియంట్​కు సంబంధించినవేనని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:Corona Vaccine : రెండు డోసుల టీకాతో కరోనా నుంచి రక్షణ

ఇదీ చూడండి:ఆ దేశంలో వయోజనులందరికి వ్యాక్సిన్ పూర్తి!

ABOUT THE AUTHOR

...view details