తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డెల్టా వేరియంట్​పై టీకాల ప్రభావం తక్కువే' - డెల్టా వేరియంట్​పై కొవాగ్జిన్ టీకా

వుహాన్ రకం కరోనా వైరస్​పై చూపించినంతగా డెల్టా వేరియంట్​పై దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు.. ప్రభావం చూపించలేకపోతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే, డెల్టా రకంపై ఎనిమిదింతల తక్కువగా ఈ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతున్నాయని వెల్లడైంది.

Delta variant
డెల్టా వేరియంట్​

By

Published : Jul 6, 2021, 5:14 AM IST

Updated : Jul 6, 2021, 7:13 AM IST

దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు.. వుహాన్ రకం కరోనా వైరస్​పై చూపించినంతగా డెల్టా వేరియంట్​పై ప్రభావం చూపలేకపోతున్నాయి. దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నిపుణులు చేపట్టిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మహారాష్ట్రలో తొలిసారి కనిపించిన డెల్టా వేరియంట్ (బి.1. 617.2)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ప్రమాదకర వైరస్'గా వర్గీకరించింది. ఈ క్రమంలో డెల్టాపై టీకాల ప్రభావం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు వైద్య నిపుణులు పరిశోధన సాగించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఇతర వేరియంట్లతో పోలిస్తే, డెల్టా రకంపై ఎనిమిదింతల తక్కువగా ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. "ఇతర వేరియంట్ల కారణంగా కొవిడ్​కు గురై, కోలుకున్న వారిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు.. డెల్టా రకాన్ని దీటుగా ఎదుర్కోలేకపోతున్నాయి. ఈ కారణంగానే పలువురు రెండోసారి ఇన్​ఫెక్షన్‌కు గురవుతున్నారు. దేశంలోని మూడు కేంద్రాల్లో పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా 100 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్​కు గురయ్యారు. ఎక్కువగా డెల్టా వైరస్ సోకడం వల్లే ఈ 'బ్రేక్ త్రూ' కేసులు తలెత్తాయి. ఈ వేరియంట్ కారణంగా శ్వాసవ్యవస్థ తీవ్రస్థాయి ఇన్​ఫెక్షన్‌కు గురవుతోంది. శ్వాస నాళాల్లో వైరస్ ప్రతిసృష్టి వేగంగా జరుగుతోంది. ఆరోగ్య కార్యకర్తల్లో ఈ వేరియంట్ సులభంగా వ్యాపిస్తోంది" అని నిపుణులు విశ్లేషించారు.

Last Updated : Jul 6, 2021, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details