కరోనా వల్ల దేశవ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. వ్యాక్సిన్ వచ్చేవరకు తెరవడం సాధ్యం కాదన్నారు పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతితో పాటు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు సుముఖంగా లేరని చెప్పారు.
'వ్యాక్సిన్ వచ్చేవరకు స్కూళ్లు తెరవడం కష్టమే' - coronavirus pandemic
విద్యాసంస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు పాఠశాలలు తెరవడం కష్టమే అన్నారు.
దేశంలో కరోనా ప్రారంభమైన క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 16న పాఠశాలలు, విద్యాస్థలలను మూసివేసింది కేంద్రం. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత విద్యాసంస్థలు తెరుచుకుంటాయనుకున్నప్పటికీ.. దిల్లీలో విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు మూసి ఉంటాయని అక్టోబర్ 30న ప్రకటించారు సిసోడియా.
"పాఠశాలలను తిరిగి తెరవడం సురక్షితమా? కాదా? అన్న దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సేకరించాం. వారి నుంచి కాదనే సమాధానం వచ్చింది. పాఠశాలలు తిరిగి తెరిచిన చోట పిల్లలలో కరోనా కేసులు పెరిగాయి. అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాం" అని సిసోడియా పేర్కొన్నారు.
ఇదీ చూడండి:లద్దాఖ్‌లో తిప్పలు పడుతున్న చైనా సైన్యం