ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు - jem terrorists arrest news
08:54 November 17
ఉగ్రవాదుల అరెస్టు
పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి 2 తుపాకులు, పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో దిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం సరాయ్ కాలె ఖాన్‌లో సోమవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టింది. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేశారు అధికారులు. ఇద్దరు ఉగ్రవాదులను అబ్దుల్ లాతిఫ్, అశ్రఫ్ ఖతనాగా గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారాలో వీరు నివాసముంటున్నట్లు పేర్కొన్నారు.