తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2023, 11:59 AM IST

Updated : Feb 27, 2023, 12:34 PM IST

ETV Bharat / bharat

'అగ్నిపథ్​ పథకం సరైనదే.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేం' దిల్లీ హైకోర్టు​ సమర్థన

సైన్యంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. జాతీయ ప్రయోజనాల కోసమే అగ్నిపథ్‌ పథకాన్ని తెచ్చారని పేర్కొన్న హైకోర్టు.. తద్వారా సైనిక బలగాలు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపింది. దీంతో ఈ పథకంపై దాఖలైన పిటిషన్​లను కొట్టి వేసింది.

centers agnipath scheme
centers agnipath scheme

కేంద్ర ప్రభుత్వం సైన్యంలో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. దేశ ప్రయోజనాల కోసమే అగ్నిపథ్‌ పథకాన్ని తెచ్చారని పేర్కొంది. ఈ పథకం ద్వారా సైనిక బలగాలు మరింత బలోపేతం అవుతున్నాయని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. అగ్నిపథ్‌ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తేల్చిచెప్పింది. పాత ప్రకటనల ద్వారా నియామక ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్లను కూడా తోసిపుచ్చింది. అలాంటి అభ్యర్థులు సైన్యంలో ఉద్యోగాలు పొందేందుకు అర్హులు కాదని స్పష్టం చేసింది. దిల్లీ హైకోర్టు డిసెంబర్​ 15న ఈ పిటిషన్​పై తీర్పును రిజర్వ్​లో ఉంచగా.. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్​ సతీస్​ చంద్ర శర్మ, జస్టిస్​ సుబ్రమణియం ప్రసాద్​లతో కూడిన ఈ ధర్మాసనం సోమవారం దీనిపై దాఖలైన పిటిషన్​లన్నింటిని కొట్టివేసింది. గతంలో ఈ అగ్నిపథ్​ పథకంపై దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్​ను విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

అంతకుముందు సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. కేరళ, పంజాబ్​ అండ్​ హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖలైన పెండింగ్​ పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆయా పిటిషన్​దారులు.. దిల్లీ కోర్టులోనూ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. పెండింగ్​ కేసులు బదిలీ చేయకున్నా లేదా పిటిషనర్లు అభ్యంతరం తెలిపినా.. దిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు పేర్కొంది సుప్రీం. అగ్నిపథ్​పై ఇప్పటికే పెండింగ్​లో ఉన్న కేసులు సహా తాము బదిలీ చేసిన పిటిషన్​లను కూడా పరిశీలించాలని దిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.

అసలేంటి అగ్నిపథ్​..?
త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ ​14న 'అగ్నిపథ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని తెలిపింది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ ఈ స్కీమ్​కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల యువత హింసాత్మక నిరసనలు చేపట్టింది.

Last Updated : Feb 27, 2023, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details