తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ పర్యటనల వివరాల వెల్లడిపై హైకోర్టు స్టే - సమాచార హక్కు చట్టం

భారత వాయుసేనకు కేంద్ర సమాచార కమిషన్​(సీఐసీ) ఇచ్చిన ఆదేశాలపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా ఆయన విదేశీ పర్యటన వివరాలను బహిర్గతం చేయకూడదని తెలిపింది.

Delhi HC stays CIC order directing IAF to provide information about PM's foreign visits
కేంద్ర సమాచార కమిషన్​ ఆదేశాలపై దిల్లీ హైకోర్టు స్టే

By

Published : Dec 11, 2020, 3:34 PM IST

ప్రధానమంత్రి చేపట్టిన విదేశీ పర్యటన(స్పెషల్​ ఫ్లైట్​ రిటర్న్స్​-2) వివరాలను తెలియజేయాలని భారత వాయుసేన(ఐఏఎఫ్​)కు కేంద్ర సమాచార కమిషన్​ ఇచ్చిన ఆదేశాలపై దిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్​ నవీన్​ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే.. విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్యను చెప్పడంలో ఇబ్బంది లేదని స్పష్టంచేసింది.

ప్రధానితో పాటు పర్యటించిన మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర ప్రయాణికుల వివరాలను వెల్లడించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) కింద నౌకాదళ మాజీ అధికారి లోకేష్​ కే బాత్రా పిటిషన్​ దాఖలు చేశారు. ఆ వివరాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సీఐసీ గతంలో భారత వాయుసేనను ఆదేశించింది. దీనిపై దిల్లీ హైకోర్టులో ఐఏఎఫ్​ అప్పీలు దాఖలు చేసింది.

ఈ అప్పీలుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రధానమంత్రి భద్రతా దృష్ట్యా ఆ వివరాలను వెల్లడించకూడదని చెప్పింది. తదుపరి విచారణను 2021, ఏప్రిల్ 12కు న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు సీఐసీ ఆదేశాలపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:చర్చలపై రైతులకు మరోమారు కేంద్రం విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details