దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ కరోనా బారినపడ్డారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని కోర్టు వర్గాలు శనివారం తెలిపాయి.
ఈ వారం ప్రారంభంలో.. దిల్లీ ఉన్నత న్యాయస్థానంలో మరో ముగ్గురు న్యాయమూర్తులకూ కరోనా సోకినట్టు తేలింది. తేలికపాటి వైరస్ లక్షణాలు కలిగిన వారు.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.