లాక్డౌన్ సమయంలో చాలా మంది కొత్త కళలు నేర్చుకున్నారు. మరికొంతమంది తమలో దాగున్న ప్రతిభకు పదును పెట్టారు. దిల్లీకి చెందిన ఓ బాలిక కూడా అదే తరహాలో సాధన చేసి.. ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది.
'ది డెడ్ ఎండ్' పేరుతో.. 50 పేజీల పుస్తకాన్ని కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే రాసింది యమ్నా. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన అంశాలను ఈ పుస్తకంలో ఆమె పొందుపర్చింది. దీంతో 'ఇంక్జోయిడ్ బుక్ ఆఫ్ రికార్డ్ 2021'లో ఆమె స్థానం సంపాదించింది. అంతేకాదు.. లాక్డౌన్ టైంలో ఒకటిన్నర నెలల వ్యవధిలోనే 53 పుస్తకాల స్క్రిప్టును సిద్ధం చేసింది యమ్నా. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదివే యమ్నా.. 'ఫాస్టెస్ట్ సోలో బుక్ రైటర్ 2021'గా ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.
చదువులోనూ టాప్..