తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​పై సైబర్ దాడి చైనా పనే.. 100 సర్వర్లు హ్యాక్.. ఆ డేటా రికవరీ!

Delhi Aiims Server Hack : దిల్లీలోని ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ దాడి.. చైనా హ్యాకర్ల పనేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సర్వర్లలోని డేటాను రిట్రీవ్‌ చేసినట్లు తెలిపాయి.

AIIMS Delhi server attack
దిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్

By

Published : Dec 14, 2022, 5:39 PM IST

Delhi Aiims Server Hack : దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్) సర్వర్ల హ్యాకింగ్‌ వెనక చైనా హస్తమున్నట్లు తేలింది. చైనా హ్యాకర్లు ఎయిమ్స్‌ సర్వర్లను హ్యాక్ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 100 సర్వర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు పేర్కొన్నాయి. ఇందులో కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపాయి. ఈ-హాస్పిటల్‌ సర్వర్లలో డేటాను పునరుద్ధరించినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. హ్యాకింగ్‌ నేపథ్యంలో ఎయిమ్స్‌కు సంబంధించిన అన్ని సేవలు మ్యానువల్‌గా నిర్వహిస్తున్నట్లు వివరించాయి.

ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు నవంబరు 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ సొల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆసుపత్రిలో మొత్తం 5వేలకు పైగా కంప్యూటర్లు ఉండగా ఇప్పటివరకు 1,200 పైగా కంప్యూటర్లలో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ వేసినట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details