తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన గణన ఈ ఏడాదిలోనే! - జాతీయ జనాభా పట్టిక

కొవిడ్-19 కారణంగా ఆలస్యమైన జనగణన, ఎన్​పీఆర్ ప్రక్రియ ఈ ఏడాదిలో ప్రారంభకావచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. పార్లమెంటరీ ప్యానెల్​కు నివేదించింది. ఈ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఇళ్ల పరిస్థితులు, సౌకర్యాలు, ఆస్తుల వివరాలను సేకరించనున్నారు. జనగణన మొదటిదశలో భాగంగా జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) తాజా వివరాలను సైతం పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Delayed due to COVID-19, Census work may begin this year, MHA tells par panel
జన గణన ఈ ఏడాదిలోనే!

By

Published : Mar 16, 2021, 6:16 AM IST

కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడ్డ జన గణన ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్​ ఎంపీ ఆనంద్​శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదించింది. ఈ మేరకు ఐదు సంవత్సరాల ప్రణాళికను ప్యానల్​ ముందు ఉంచింది. అయితే వీటికి సంబంధించి ఇంకా కార్యాచరణ రూపొందించలేదని వివరించింది. ఈ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఇళ్ల పరిస్థితులు, సౌకర్యాలు, ఆస్తుల వివరాలను సేకరించనున్నారు. జనగణన మొదటిదశలో భాగంగా జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) తాజా వివరాలను సైతం పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

2022-23లో జనాభా, మతం, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాష, అక్షరాస్యత, విద్య, ఉపాధి, వలస, సంతానం.. తదితర వివరాలను సేకరించనున్నారు. జనగణన కోసం రూ. 8,754.23 కోట్లు, జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) ప్రక్రియ కోసం రూ. 3,941.35 కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చదవండి :ఆర్మీ నియామకాల స్కాంలో 23మందిపై కేసు

ABOUT THE AUTHOR

...view details