శత్రు దేశ లక్ష్యాలను క్షణాల్లో ధ్వంసం చేసే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థ-భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మధ్య ఒప్పందం కుదిరింది. భారత సైన్యం కోసం మెుత్తం 1,188 కోట్ల రూపాయలతో.. 4,960 మిలాన్-2టీ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను బీడీఎల్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మిలాన్-2టీ క్షిపణులను భూ ఉపరితం అదేవిధంగా వాహన ఆధారిత లాంఛర్ల నుంచి సైతం ప్రయోగించవచ్చని రక్షణశాఖ తెలిపింది. మూడేళ్లలో వీటిని భారత్ సైన్యంలో ప్రవేశపెడతామని రక్షణశాఖ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ సంస్థ ఎంబీడీఏ ఇచ్చిన లైసెన్స్ ప్రకారం వీటిని బీడీఎల్ ఉత్పత్తి చేస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.