త్రివిధ దళాల కోసం పలు రకాల ఆయుధాలు, వ్యవస్థలు, సాధనాల కొనుగోలుకు ఉద్దేశిందిన ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రూ.13,700 కోట్ల ఆయుధ కొనుగోళ్లకు ఆమోదం
రూ. 13,700 కోట్ల ఆయుధ కొనుగోళ్లకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఆమోదం తెలిపింది. వీటిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ రూపొందించిన ఆయుధ వ్యవస్థలు కూడా ఉన్నాయి.
రూ.13,700 కోట్లు ఆయుధ కొనుగోళ్లకు ఆమోదం
ఈ ఆయుధాల విలువ రూ.13, 700 కోట్ల రూపాయలు కాగా వీటిని దేశీయంగానే అభివృద్ధి చేస్తారు. వీటిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ రూపొందించిన ఆయుధ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇందులో 118 అర్జున్ మార్క్-1ఏ యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి విలువ రూ.8 వేల 300 కోట్ల మేర ఉంటుందని పేర్కొన్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ ట్యాంకులను ఇటీవలే ప్రధాని సైన్యానికి అప్పగించారు.