తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రుణ భారతం.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల​పై పెరిగిన భారం

debt burden of india: గత ఆరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం క్రమంగా పెరిగింది. 2020-21 జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 87.8 శాతానికి చేరింది.

india debt burden
భారత్ రుణభారం

By

Published : Dec 8, 2021, 6:51 AM IST

debt burden of india: రాను రాను దేశం రుణభారతంగా రూపాంతరం చెందుతోంది. గత ఆరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020-21 జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 87.8%కి చేరింది. 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఇందులో భారీ పెరుగుదల నమోదైంది. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌శర్మ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఆర్థికలోటు, రుణభారం నియంత్రించుకోవడం కోసం ప్రభుత్వం పన్ను ఆదాయం పెంచుకోవడం, ఆస్తుల నగదీకరణతో వనరులు సమీకరించుకోవడం, ప్రభుత్వ ఖర్చుల్లో నాణ్యత పెంచడం లాంటి ముఖ్యమైన చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం రుణ నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. ఖర్చు తగ్గించుకోవడం, సవాళ్లను ఎదుర్కోవడం, ప్రభుత్వ సెక్యూరిటీల కోసం మార్కెటును అభివృద్ధి చేసుకోవడం.. ఈ మూడు స్తంభాల చుట్టూ ఈ వ్యూహం అల్లుకున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల భారం

ఇదీ చదవండి:వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే: రాహుల్​

ABOUT THE AUTHOR

...view details