తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో 25కు మృతులు - virudinagar cracker factory fire accident deaths

తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 25కు చేరినట్లు అధికారులు తెలిపారు. బాణసంచా ఫ్యాక్టరీలు అవకతవకలకు పాల్పడకుండా నిఘా ఉంచేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

death-toll-mounts-to-25-in-virudhunagar-factory-fire-in-tamil-nadu
బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో 25కు మృతులు

By

Published : Mar 9, 2021, 5:33 AM IST

Updated : Mar 9, 2021, 6:12 AM IST

తమిళనాడు విరుధునగర్ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. ఫిబ్రవరి 12న ఈ ఘటన జరగ్గా.. అదే రోజు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతుల సంఖ్యపై జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.

బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 80 బాణాసంచా ఫ్యాక్టరీలను మూసేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. కర్మాగారాలు అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Mar 9, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details