బిహార్ ముఫాసిల్ స్టేషన్ పరిధిలోని కతిహార్‌లో అమానవీయ ఘటన జరిగింది. పీపీఈ కిట్ ధరించిన కొందరు వ్యక్తులు.. ఓ కొవిడ్ మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొచ్చి గంగానదిలో పడేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో గురించి తనకు తెలియదని స్థానిక సివిల్ సర్జియన్ డాక్టర్. డీఎన్ పాండే తెలిపారు.
కొవిడ్ మృతదేహాన్ని గంగానదిలోకి విసిరిన వ్యక్తులు - కొవిడ్ మృతదేహాన్ని గంగానదిలో పడేసిన వైనం
ఓ కొవిడ్ మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్లి.. గంగానదిలో పడేసిన ఘటన బిహార్‌లోని కతిహార్ సమీపంలో జరిగింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గంగానదిలో కొవిడ్ మృతదేహాలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?