దేవీ నవరాత్రి ఉత్సవాలను (Navratri Celebration) ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. చాలా మంది భక్తులు తమ ఇళ్లలో బొమ్మలను పెట్టి దసరా వేడుకలను (Dasara Festival) నిర్వహిస్తారు. కర్ణాటకలో ఓ దంపతులు మాత్రం 31 దేశాలకు చెందిన బొమ్మలను (Dasara Dolls) ప్రదర్శించడం విశేషం. వాటిల్లో ప్రసిద్ధ చెన్నపట్టణం దైవ ప్రతిమలు సహా మైసూర్ బొమ్మలు కూడా ఉన్నాయి.
దావణగెరెలో నివాసముంటున్న మురుగేంద్రప్ప, సుమంగళ దంపతులు.. 21 ఏళ్ల పాటు నైజీరియాలో ఉన్నారు. ఆ దేశ ప్రత్యేకతను చాటిచెప్పే ఎన్నో బొమ్మలను ఆ సమయంలో వారు సేకరించారు (Dolls Collection).
"ఆఫ్రికా దేశాలు సహజంగానే సంపన్నమైనవి. హస్త కళ.. అక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. నేను నైజీరియాకు 1991లో వెళ్లాను. ఆ దేశ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి నాకు రెండేళ్లు పట్టింది. నైజీరియా మొత్తం చుట్టేశాను. అక్కడి బొమ్మలు, కళాకృతులను కొంటూ ఉండేవాడిని."
-మురుగేంద్రప్ప