ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబూపుర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి తండ్రి తన కుమార్తెను కాల్చి చంపాడు. హత్య చేసిన తరువాత నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.
నిందితుడు శైలేంద్ర కుమార్ మద్యానికి బానిసయ్యాడు. మత్తులో భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. 18 ఏళ్ల కూతురు షాలిని గొడవను ఆపి తన తల్లిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తండ్రి పిస్టల్‌తో కూతురిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ కూతురి ఛాతీకి తగిలింది. కూతురు షాలిని అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
టీచర్‌ను రివాల్వర్‌తో ఐదుసార్లు కాల్చిన లాయర్..
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇటావా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ లాయర్, అభిలాష అనే టీచర్‌ను రివాల్వర్‌తో 5 సార్లు కాల్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆమెను హాస్పిటల్లో చేర్చిన 15 నిమిషాలకే ఆ లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరికీ మధ్య పాత సంబంధం ఉందనే వాస్తవం బయటకు వచ్చింది.