Dussehra 2023 Special Mutton Recipes in Telugu :దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీ. దసరా వచ్చిదంటే చాలు.. ప్రతి ఇంట జరిగే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణలో అయితే విజయదశమి(Vijayadasami)ని పురస్కరించుకుని పల్లె నుంచి పట్టణం వరకు చుక్క, ముక్క లేనిది పండగ జరుపుకోరు. సామాన్య పౌరుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ దసరా సంబరాల్లో మునిగితేలుతారు. కొత్త బట్టలు, పిండివంటలతో పాటు మాంసాహారం తినే ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ ఐటమ్స్ ఘుమఘుమలాడాల్సిందే. అందులో మటన్ది ప్రత్యేక స్థానం. అయితే ఈసారి దసరా(Dussehra 2023)పండక్కి మేము చెప్పే ఈ మటన్ ఐటమ్స్ ట్రై చేశారంటే.. గల్లీ మొత్తం మీ ఇంటిగుమ్మం వైపు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ సూపర్ మటన్ రెసిపీలపై ఓ లుక్కేయండి..
How to Prepare Mutton Masala Curry :దసరా పండక్కి ప్రతిఒక్కరూ నాన్‌వెజ్ ఐటమ్స్‌లో మటన్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అందులో చాలా మంది మటన్ మసాలా కర్రీని ఇష్టపడతారు. ఎందుకంటే దసరా అంటే చుక్క, ముక్క కాబట్టి.. మద్యం ప్రియులకు మంచి స్టఫ్‌గా ఉపయోగపడుతుంది. అయితే మీరు కూడా మటన్ ప్రియులైతే.. మేము చెప్పే విధంగా మటన్(Mutton Masala Curry) మసాలా కర్రీ ట్రై చేస్తే.. బొక్క కూడా వదలరు సుమీ.! అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మటన్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- మటన్- కేజీ
- నూనె- నాలుగు చెంచాలు
- ఉల్లిపాయ- ఒకటి (పెద్దది)
- కారం- రెండు చెంచాలు
- పసుపు- పావుచెంచా
- పెరుగు- కప్పు
- అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు చెంచాలు
- ధనియాలపొడి- చెంచా
- గరంమసాలాపొడి- చెంచా
- ఉప్పు- తగినంత
- కొబ్బరిపొడి- నాలుగు చెంచాలు
- గసగసాలు- రెండు చెంచాలు
- నీళ్లు- రెండు కప్పులు
- కొత్తిమీర- కొద్దిగా
మటన్ మసాలా కర్రీ తయారీ విధామిలా..
How to Make Mutton Masala Curry in Telugu : ముందుగా మీరు గసగసాలు, కొబ్బరిపొడిని కొద్దిగా వేయించుకుని మిక్సీలో ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయముక్కలు వేసుకుని బంగారు రంగులోకి వచ్చేంతవరకూ వాటిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పైన పేర్కొన్న విధంగా ఆ మిశ్రమానికి పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అవి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి.
అనంతరం కడిగి శుభ్రం చేసిన మటన్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఆ తర్వాతే కారం, ధనియాలపొడి, ఉప్పు వేసుకోవాలి. సన్న సెగమీద మంటని ఉంచి పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరిపేస్ట్, పెరుగు, గరంమసాలా యాడ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి... మూడు నిమిషాలు ఉంచిన తర్వాత దానిలో తగినంత వాటర్ పోసి కుక్కర్ మూతపెట్టేయాలి. మటన్ మెత్తబడే వరకూ ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. అంతే ఘుమఘుమలాడా మటన్ మసాలా కర్రీ రెడీ.!
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!
తలకాయ కర్రీ(Talakaya Curry) :దసరా పండక్కి చాలా మంది మేక తలకాయ తెచ్చుకుని వండుకుందామనుకుంటారు. కానీ, దానిని ఎలా వండాలో తెలియక ఆగిపోతారు. అలాంటి వారు మేము చెప్పేవిధంగా ట్రై చేస్తే చాలు.. చాలా సింపుల్‌గా తలకాయ కర్రీ వండేయొచ్చు. అయితే ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- తలకాయ మాంసం- కిలో
- నూనె- నాలుగు చెంచాలు
- షాజీర- చెంచా
- ఉల్లిపాయ- పావుకిలో
- టమాటాలు- 100గ్రా.
- పచ్చిమిర్చి- ఆరు
- అల్లంవెల్లుల్లి పేస్ట్- చెంచా
- కారం- రెండు చెంచాలు
- పసుపు, ఉప్పు- తగినంత
- ధనియాలపొడి- చెంచా
- గరంమసాలాపొడి- చెంచా
- పుదీనా- మూడురెబ్బలు
- కొత్తిమీర- కొద్దిగా