కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్‌ను తొలగించింది ట్విట్టర్ ఇండియా. దిల్లీలో హత్యాచారానికి గురైన 9ఏళ్ల దళిత బాలిక తల్లిదండ్రుల కలిసిన ఫోటోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. అది వివాదాస్పదం కావటం వల్ల తాజాగా ఆ ట్వీట్‌ను తొలగించింది ట్విట్టర్.
బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపించేలా ఉన్నందున జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్) ట్విట్టర్‌కు నోటీసులు పంపింది. పోక్సో, జువెనైల్ చట్టాలను అది ఉల్లంఘిస్తోందని సూచిస్తూ ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఖాతాపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై ట్విట్టర్ స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా పోస్ట్ ఉన్నట్లు గుర్తించామని, ట్వీట్‌ను తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్ ద్వారా రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చి ట్వీట్‌ను తొలగించింది.