కరోనా పోరులో భారత్‌కు అంతర్జాతీయ దేశాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా టిబెట్ బౌద్ధగురువు దలైలామా కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన ట్రస్ట్ ద్వారా భారత ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"భారత్ సహా ప్రపంచమంతా కొవిడ్ మహమ్మారితో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత సోదర, సోదరీమణులకు అండగా ఉండేందుకు పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్ట్‌ను కోరాను. మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అభినందనలు. కొవిడ్ ముప్పు త్వరలోనే తొలగిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా."
- దలైలామా, టిబెట్ బౌద్ధగురువు