తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం డీఏ పెంపు - పీఎంయూవై సబ్సిడీ

DA Hike 2023 : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది. ఉద్యోగులకు ఇచ్చే డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్​ మీటింగ్​లో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. అదే విధంగా 69.76 లక్షల మంది పింఛన్​దారులు లబ్ధి పొందనున్నారు.

govt-hikes-da-for-central-govt-employees-in-central-cabinet-meeting
ఉద్యోగుల డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం

By

Published : Mar 24, 2023, 10:14 PM IST

Updated : Mar 24, 2023, 10:59 PM IST

DA Hike 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్​ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యాన్ని 4 శాతం పెంచింది. ఫలితంగా 38 శాతం ఉన్న డీఏ 42 శాతానికి చేరుకుంది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశం​లో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. అదే విధంగా 69.76 లక్షల మంది పింఛన్​దారులు లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర ఖాజానాపై సంవత్సరానికి రూ.12,815 కోట్ల భారం పడనుందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ తెలిపారు. ఈ పెంపును 2023 జనవరి 1 నుంచే అమలు పరచనున్నట్లు ఆయన వెల్లడించారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా.. డీఏను పెంచినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. అంతకుముందు గతేడాది సెప్టెంబర్​లో కరవు భత్యాన్ని పెంచింది ప్రభుత్వం. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు 4 శాతాన్ని పెంచింది. ఫలితంగా 34 శాతం ఉన్న డీఏ 38 శాతానికి చేరుకుంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

పెరిగిన PMUY సబ్సిడీ..
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద అందించే LPG సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని.. రూ.200కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎక్కవగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేరుకుతుందని ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్​ను.. సంవత్సరానికి 12 సార్లు.. సబ్సిడితో రీఫిల్​ చేసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు.

కాగా 2023 మర్చి 1 నాటికి దేశంలో పీఎమ్​యూఐ కింద 9.59 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకంపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,100 కోట్లు ఖర్చు చేశామని మంత్రి వెల్లడించారు. అదే విధంగా 2023-24 సంవత్సరానికి ఈ ఖర్చు రూ. 7,680 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఈ సబ్సిడీ నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్​ ఖాతాల్లో పడుతుందని మంత్రి అనురాగ్​ ఠాకూర్​ చెప్పారు. పీఎమ్​యూఐ కింద ఎల్​పీజీ వినియోగ సగటు.. 2019-20లో 3.01 రీఫిల్స్ నుంచి 2021-22లో 3.68కి పెరిగింది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. పేద కుటుంబాలకు చెందిన వయోజన మహిళలకు ఎల్​పీజీ కనెక్షన్లను ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని గ్రామీణ, వెనుకబడిన పేద కుటుంబాలకు అందుబాటులో ఉంచడమే పథకం ప్రధాన ఉద్దేశం.

Last Updated : Mar 24, 2023, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details