Cyber Criminals Harassment Young Man Committed Suicide: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు(Cyber Crime Cases in Hyderabad) తారాస్థాయికి పెరిగిపోయాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతరం ముందుకు సాగుతుంటే.. ఆ సరికొత్త టెక్నాలజీనే మంత్రంగా వాడుకొని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వీరి మీద ఎంత నిఘా పెట్టిన వారి అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఓ వైపు ఆన్లైన్లో డబ్బులు ఆశచూపడం, మరోవైపు తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామంటూ లక్షల్లో కొల్లగొట్టడం, మరోవైపు లోన్ యాప్‌ల పేరుతో లక్షలు దోచుకొని.. తీరా వారి పర్షనల్ ఇన్ఫర్మేషన్ను సామాజిక మాధ్యమాల్లో పెట్టి వారి మరణానికి కారకులు అవుతున్నారు. ఇలాంటి సైబర్ ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు భరించలేక యువకుడు(Young Man Suicide Cyber Criminals Harassment) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేసుకొని.. కంప్యూటర్ కోర్సు శిక్షణ కోసం నెల రోజుల కిందట అమీర్‌పేటకు వచ్చాడు. అక్కడ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ బాయ్స్ హాస్టల్లో ఉంటూ రోజూ శిక్షణకు వెళ్లేవాడు. తనతో పాటు మరో నలుగురు యువకులు కూడా అదే గదిలో కలసి ఉండేవారు. ఇటీవల అతనికి ఓ యువతి వాట్సాప్‌లో ఓ వీడియో కాల్ చేసి మాట్లాడింది. అంతే అంతలోనే ఆ యువకుడికి అటువైపు ఓ మెసెజ్ వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఆ కాల్ రికార్డును నగ్న వీడియోగా మార్ఫింగ్ చేసి పంపించారు. అది చూసి ఆ యువకుడు ఒక్కసారిగా కంగుతున్నాడు.
వాట్సాప్‌లో చిన్నారుల పోర్న్వీడియోస్ వైరల్.. నిందితుడిని గుర్తించిన అమెరికా దర్యాప్తు సంస్థ