తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐసీయూలో​ ఆగిన విద్యుత్.. కరోనా రోగుల ఉక్కిరిబిక్కిరి

మధ్యప్రదేశ్​ రేవా జిల్లాలోని సంజ​య్​ గాంధీ ఆస్పత్రిలో ఐదు నిమిషాల పాటు విద్యుత్​ సరఫరా నిలిచిపోవడంతో ఐసీయూలోని రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Current failure in Sanjay Gandhi hospital created panic for while, video goes viral
ఐసీయూలో​ ఆగిన విద్యుత్.. కరోనా రోగుల ఉక్కిరిబిక్కిరి

By

Published : Apr 24, 2021, 1:46 PM IST

సంజ​య్​ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయిన దృశ్యాలు

మధ్యప్రదేశ్​ రేవా జిల్లా సంజయ్ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం.. సుమారు ఐదు నిమిషాల పాటు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. దీనితో కొవిడ్​ ఐసీయూ వార్డులోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ బాధితులందరూ ఆక్సిజన్​ మద్దతుతోనే చికిత్స పొందుతుండటం గమనార్హం.

ఆస్పత్రి నిర్వాహకులు త్వరితగతిన విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే కరెంట్​ పోయిన సమయంలో వార్డులో రోగులు ఎదుర్కొన్న ఇబ్బందుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దిల్లీలోని సర్​ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్​ లేక 25 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రస్తుత ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆస్పత్రిలో సుమారు 500 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details