తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.4.5కోట్లు విలువైన క్రిప్టోకరెన్సీ చోరీ.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

Crypto Hack News: క్రిప్టోకరెన్సీ చోరీ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు దిల్లీ పోలీసులు. పాలస్తీనాకు చెందిన ఉగ్ర సంస్థ సైబర్ హ్యాకింగ్​తో రూ.4.5 కోట్లు విలువగల క్రిప్టో కరెన్సీని అక్రమంగా బదిలీ చేసిందని తేల్చారు.

Crypto Hack
క్రిప్టో కరెన్సీ చోరీ

By

Published : Jan 24, 2022, 1:48 PM IST

Crypto Hack News: క్రిప్టోకరెన్సీ చోరీ కేసును దిల్లీ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్​కు చెందిన మిలిటరీ వింగ్​ (అల్-కస్సామ్ బ్రిగేడ్స్) సైబర్​ మాడ్యూల్​ను బయటపెట్టారు. టెక్నాలజీని ఉపయోగించి క్రిప్టో వా​లెట్ల నుంచి డబ్బులను ఆ సంస్థ డిజిటల్ వాలెట్లకు అక్రమంగా బదిలీ చేశారని గుర్తించారు.

Delhi Crypto Hack: దిల్లీలోని పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్​లో కొంతకాలం క్రితం ఈ కేసు నమోదైంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ రూ.4.5 కోట్ల విలువగల క్రిప్టోకరెన్సీని వాలెట్​ నుంచి అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఫిర్యాదు వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు.

ఈ సొమ్ము.. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్​కు చెందిన మిలిటరీ వింగ్​ (అల్-కస్సామ్ బ్రిగేడ్స్) అకౌంట్లకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ డిజిటల్ వాలెట్ల నుంచి బదిలీ అయి.. చివరికి హమాస్​కు చేరాయని తేల్చారు. ఈ సంస్థకు చెందిన వాలెట్లను ఇజ్రాయెల్ ఇప్పటికే నిషేధించిందని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:తప్పిపోయిన ఆ పిల్లి జాడ చెబితే రూ.35వేల రివార్డ్!

ABOUT THE AUTHOR

...view details