రైల్వే శాఖపై కొవిడ్ పంజా విసురుతోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,952 మంది ఉద్యోగులు మృతి చెందారని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. ప్రతిరోజు దాదాపు 1,000 మంది ఉద్యోగులు కరోనా బాధితులుగా మారుతున్నారని వెల్లడించారు. రైల్వే ఉద్యోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
"ప్రతిరోజు దాదాపు 1,000 మందికి కరోనా సోకుతోంది. మాకు మా ఆస్పత్రులు ఉన్నాయి. పడకల సంఖ్యను పెంచాం. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. మా సిబ్బంది సంరక్షణ కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మా ఆస్పత్రుల్లోని 4,000 పడకలు మా సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో నిండిపోయాయి. వారు త్వరగా కోలుకోవడానికి మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గతేడాది మార్చి నుంచి శనివారం వరకు 1,952 మంది ఉద్యోగులు కరోనా బారిన పడి కన్నుమూశారు."
-సునీత్ శర్మ, రైల్వే బోర్డు ఛైర్మన్
ఇప్పటివరకు రైళ్ల ద్వారా 295కుపైగా ట్యాంకర్లతో 4,700 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను వివిధ రాష్ట్రాలకు తరలించామని సునీత్ శర్మ చెప్పారు.
సీఆర్పీఎఫ్లో 108 మంది..