తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణలో కేసీఆర్‌ను గెలిపించడానికి జగన్ కుట్ర పన్నారు : సీపీఐ నారాయణ

CPI Narayana On Telangana Election Result : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సానుకుల పవనాలు వీచాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి అన్నారు.

CPI Narayana On BRS Ruling
CPI Narayana On Telangana Election Result

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 3:39 PM IST

CPI Narayana On Telangana Election Result : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శినారాయణ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ హంగ్ రాదన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి పోతారని.. బీఆర్ఎస్ క్యాంపు రాజకీయానికి శ్రీకారం చుడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపునకు పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల పోలింగ్ తర్వాత వెలువడిన సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలుస్తుంది.. అహంభావం పోతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌కు అహంభావం ఎక్కువని విమర్శించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై డాటర్‌ స్ట్రోక్‌, సన్ స్ట్రోక్ పడిందని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు

CPI Narayan On BRS Ruling :కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబోతున్నారని.. రేవంత్‌రెడ్డి శాసనసభాపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆహ్వానించాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకుని నాగార్జున సాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకం ఆడిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గెలిపించడానికి జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు గెలిపిస్తాయని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. ఏ ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణను సాధించామో.. ఆ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేసీఆర్ పాలన సాగించారని విమర్శించారు. అభివృద్ధి తెలంగాణ ప్రజలకా.. లేక కల్వకుంట్ల కుటుంబానికా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పోవాలనే లక్ష్యంతో సీపీఐకి ఒక్క సీటు ఇచ్చినా అంగీకరించామని తెలిపారు. కొత్తగూడెంలో సీపీఐ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు శ్రమించారని చెప్పారు.

తెలంగాణలో 70.79% పోలింగ్‌ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది

2009లో తెలంగాణ అంతా పోలింగ్ అయిపోయింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నంద్యాలలో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటూ ఆంధ్రాలో మహాకూటమికి ఓటు వేస్తే.. హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తే పాస్‌పోర్టు అవసరం పడుతది అన్నారు. దాంతో ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు జగన్. కానీ ఆయన ఏవీ ఫాలో కాలేదు. ఇక్కడ పోలింగ్ జరుగుతుంటే తెల్లవారుజామున 5 గంటలకు నాగార్జునసాగర్ నీటిని అడ్డం పెట్టుకుని 500 మంది పోలీసులను పంపించాడు. - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

CPI Narayana On Telangana Election Result తెలంగాణలో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాబోతున్నాడు నారాయణ

ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం - మధ్యాహ్నం తరువాత పోలింగ్‌ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ

CPI Chada Venkat Reddy on Telangana Election Result :ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీచాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పట్టణాల కంటే పల్లెల్లో బీఆర్ఎస్‌ సర్కారుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రైతు బంధు కోటీశ్వరుడికి తప్పితే ఒకటి రెండు ఎకరాలు ఉన్న రైతులకు ప్రయోజనం లేదన్నారు. దళిత బంధులో 30 శాతం కమీషన్‌ ఎమ్మెల్యేలు తీసుకున్నాని కేసీఆర్‌ స్వయంగా చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయించడంలో సీపీఐ ఎనలేని కృషి చేసిందని తెలిపారు.

ఓటర్లతో పోటెత్తిన పల్లెలు-ఉవ్వెత్తున నమోదైన పోలింగ్​

పార్టీ కండువాలతో పోలింగ్​ కేంద్రాలకు పలువురు ఎమ్మెల్యేలు - మంత్రి ఇంద్రకరణ్​రెడ్డిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details