తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోవిన్‌ యాప్‌: ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలంటే..

కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలను అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ). అయితే దేశవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కోవిన్‌( కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటిలిజెన్స్‌ వర్క్‌)యాప్‌ను రూపొందించింది కేంద్రం. ఈ యాప్‌ ద్వారానే టీకా పంపిణీ జరగనుందని కేంద్రం స్పష్టం చేసింది.

cowin app-how to register documents needed to get covid-19 vaccine in india
కోవిన్‌ యాప్‌: ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలంటే..

By

Published : Jan 4, 2021, 11:00 PM IST

భారత్‌లో రెండు కరోనా వ్యాక్సిన్‌లకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. కొవాగ్జిన్‌, భారత్‌ బయోటెక్‌లు మొదటిదశ వ్యాక్సినేషన్‌ కోసం టీకాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నాయి. టీకాను ముందుగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి అందించనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్రం కోవిన్‌ ( కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటిలిజెన్స్‌ వర్క్‌) యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారానే టీకా పంపిణీ జరగనుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కోవిన్‌ యాప్‌ను సమర్థవంతంగా రూపొందించేందుకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ 2020, డిసెంబరు 23న పిలుపునిచ్చారు. త్వరలో కోవిన్‌ యాప్‌ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఎక్కడ లభిస్తుందంటే..

ప్రస్తుతానికి కోవిన్‌ యాప్‌ అందరికీ అందుబాటులోకి రాలేదు. అది ఇంకా ప్రీ ప్రొడక్ట్‌ దశలోనే ఉంది. ఇందులో ప్రస్తుతం ఆరోగ్య కార్యకర్తల వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకూ 75లక్షలకు పైగా ఆరోగ్యాధికారులు, కార్యకర్తలు వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇది పూర్తి స్థాయిలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్లలో ఉచితంగా లభిస్తుంది.

ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలంటే..

కోవిన్‌ యాప్‌ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో నాలుగు మాడ్యూల్స్‌ ఉంటాయి. అవి యూజర్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాడ్యూల్‌, బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్‌, వ్యాక్సినేషన్‌ అండ్‌ బెనిఫిషియరీ ఎక్నాలడ్జ్‌మెంట్‌, స్టేటస్‌ అప్‌డేట్‌. రిజిస్ట్రేషన్‌లోకి వెళ్లిన తర్వాత సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌, ఇండివిడ్యువల్‌ రిజిస్ట్రేషన్‌, బల్క్‌ అప్‌లోడ్‌ ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో బల్క్‌ అప్‌లోడ్‌ అనేది ఆరోగ్యాధికారులు క్యాంప్‌లు నిర్వహించి రిజిస్ట్రేషన్లు చేసే అవకాశముంది. టీకా రెండు డోసులు పూర్తైన తర్వాత ఈ-సర్టిఫికెట్‌ను కూడా ఈ యాప్‌లోనే అందిచనున్నారు.

ఏఏ పత్రాలు కావాలంటే..

వ్యాక్సిన్ కోసం రిజిస్టర్‌ చేసుకోవడానికి ప్రజలు ఫొటో గుర్తింపు కార్డు నెంబరుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు మొదలైనవి. కాగా ఫ్రంట్‌లైన్‌ ఆరోగ్య సిబ్బందికి టీకాను అందించనున్నట్లు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఇదివరకే ప్రకటించారు.

ఇదీ చదవండి:టీకా​ కోసం ఈ వారమే భారత్​ బయోటెక్​తో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details