తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆవుపై అత్యాచారం- నిందితుడికి గ్రామస్థులు దేహశుద్ధి - ఆవుపై అత్యాచారం

ఓ యువకుడు ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన హరియాణాలోని సోనీపత్​లో జరిగింది. గమనించిన గ్రామస్థులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

rape with cow
ఆవుపై అత్యాచారం

By

Published : Nov 2, 2021, 10:45 AM IST

Updated : Nov 2, 2021, 11:41 AM IST

కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు. వావీ వరుసలు లేకుండా మానవ సమాజానికి కళంకంగా మారుతున్నారు. మూగజీవాలను సైతం వదలని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో శునకంపై అత్యాచారం చేసిన వార్త మరువక ముందే హరియాణా సోనీపత్​​ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ యువకుడు ఆవుపై అత్యాచారం చేశాడు.

ఇదీ జరిగింది..

జిల్లాలోని లివాస్​పుర్ గ్రామంలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ యువకుడు నివసిస్తున్నాడు. ఇటీవల ఓ ఆవుపై యువకుడు అత్యాచారం చేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆవు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:చట్టానికి తరతమ భేదాలేమీ ఉండవు కదా.. మరి వీరి సంగతేంటి?

Last Updated : Nov 2, 2021, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details