మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి మూత్రం, పేడతో వ్యక్తిగత ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.
ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ నిర్వహించిన మహిళా పశువైద్యుల సమ్మేళన సదస్సులో(శక్తి 2021) భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ సీఎం. ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అయితే.. సమాజ భాగస్వామ్యంతోనే పశుసంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు.
"గోవులు, గోపేడ, గోమూత్రంతో వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యాన్ని పటిష్ఠం చేసుకోవటం ద్వారా.. దేశ ఆర్థిక స్థితిని మరింత బలపరచొచ్చు. కలప వాడకాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ శ్మశానవాటికల్లో గౌకాస్త్(ఆవు పేడతో చేసిన పిడకలు) ఉపయోగిస్తున్నారు."
--శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.