కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితం, ఇమ్యునోజెనిక్ అని నొక్కిచెప్పింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ). చెన్నై వలంటీర్‌కు ఎదురైన సమస్య తమ టీకా వల్ల కాదని మరోమారు స్పష్టం చేసింది. టీకా అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌లో అవసరమైన అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలు, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించామని వెల్లడించింది.
" కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితం, ఇమ్యునోజెనిక్. చెన్నై వలంటీరుకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమే అయినప్పటికీ టీకా వల్ల కాదు. వలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సానుభూతితో ఉంది. అన్ని రకాల నియంత్రణ, నైతిక ప్రక్రియలు, మార్గదర్శకాలను కచ్చితత్వంతో అనుసరించామని స్పష్టం చేస్తున్నాం. దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. డీఎస్ఎంబీ, నైతిక విలువల కమిటీ స్వతంత్రంగా పరిశీలించి ఈ సమస్యతో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధం లేదని తేల్చాయి. ఈ సంఘనటకు సంబంధించిన నివేదికలు, సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి పంపించాం. అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నాం."
- సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా