తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో మళ్లీ కొవిడ్ విజృంభణ- కొత్తగా 19 వేల కేసులు

కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కేరళలో కొత్తగా 19 వేలకు పైగా కేసులు (Kerala Covid Cases) బయటపడగా.. మహారాష్ట్రలో 3608 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ (India Vaccination) 83 కోట్లు దాటింది.

kerala covid cases
కేరళలో మళ్లీ కొవిడ్ విజృంభణ- కొత్తగా 19 వేల కేసులు

By

Published : Sep 22, 2021, 10:45 PM IST

కేరళలో కరోనా కేసులు (Kerala Covid Cases) భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు నాలుగు వేలకు పైగా అధికంగా కేసులు బయటపడ్డాయి. కొత్తగా 19,675 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 142 మంది మరణించినట్లు తెలిపింది.

అదే సమయంలో 19,702 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని కేరళ వైద్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,61,026గా ఉందని వివరించింది.

మహారాష్ట్రలో కొత్తగా 3,608 కేసులు (Covid cases in Maharashtra) వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాటి కేసులతో పోలిస్తే ఈ సంఖ్య 477అధికం. మరోవైపు, బుధవారం 48 కరోనా మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్య శాఖ తెలిపింది.

కర్ణాటకలో 847 కేసులు (Covid cases in Karnataka) బయటపడ్డాయి. 20 మంది కరోనాతో చనిపోయారు. దేశరాజధాని దిల్లీలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు.

హిమాచల్​ప్రదేశ్​లో 212, జమ్ము కశ్మీర్​లో 204, గోవాలో 102, మధ్యప్రదేశ్​లో 12 కొవిడ్ కేసులు బయటపడ్డాయి.

వ్యాక్సినేషన్ @83 కోట్లు

దేశంలో టీకా పంపిణీ (India Vaccination count) రికార్డు వేగంతో కొనసాగుతోంది. బుధవారం(రాత్రి 7 గంటల వరకు) 64,98,274 మంది లబ్ధిదారులుక టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 83 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.

ఇదీ చదవండి:కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారం!

ABOUT THE AUTHOR

...view details