18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారికి.. ఉచితంగా కొవిడ్ టీకా ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 15 నుంచి 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. అర్హులందరికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉచితంగా ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరోనా టీకా మూడో డోసు తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపాయి.
కొవిడ్ టీకా ప్రికాషన్ డోస్ ఇక ఫ్రీ.. వారికి మాత్రమే! - covid vaccine booster dose india
Covid vaccine precaution dose free: కొవిడ్ టీకా ప్రికాషన్ డోసును ఈనెల 15 నుంచి ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 18-59 ఏళ్ల వయసు వారు ఇందుకు అర్హులని తెలిపింది.
18 నుంచి 59 ఏళ్ల మధ్యనున్నవారిలో.. కొవిడ్ టీకా ప్రికాషన్ డోసుకు 77కోట్ల మంది అర్హులు. వీరిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. ఇదే సమయంలో టీకా తీసుకునేందుకు అర్హులైన 60 ఏళ్లకు పైబడిన వారు 16కోట్ల మంది ఉండగా.. వారిలో 26శాతం మంది ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనాభాలో మెజారిటీ భాగం. 9 నెలల కిందట రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. ఆరునెలల తర్వాత యాంటీబాడీల స్థాయి తగ్గుతున్న విషయాన్ని ఐసీఎంఆర్ సహా ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనంలో తేలిందని వివరించారు. ఈ నేపథ్యంలో అర్హులైన వ్యక్తులు ప్రికాషన్ డోసు తీసుకోవాలని కోరుతున్నారు.
కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య గడువును కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవలే 9 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించింది.