కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి న్యాయస్థానాల్లో మళ్లీ ప్రత్యక్ష విచారణలు(Physical Hearing In Court) మొదలవుతున్న నేపథ్యంలో కోర్టుల్లో రద్దీ నివారణకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోంది. 'కొవిడ్ మేనేజ్‌మెంట్ ప్యాచ్' అనే ఈ కార్యక్రమ సాయంతో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తూ(Physical Hearing In Court) ఇంకా కాలవ్యవధి ఉన్న కేసులను వాయిదా వేయడం ద్వారా కోర్టు గదుల్లో రద్దీ ఏర్పడకుండా చూసేందుకు జడ్జీలకు వెసులుబాటు చిక్కుతుంది.
'కొవిడ్ ప్యాచ్'తో కోర్టుల్లో రద్దీకి చెక్!
కోర్టుల్లో మళ్లీ ప్రత్యక్ష విచారణలు(Physical Hearing In Court) మొదలవుతున్న నేపథ్యంలో రద్దీ నివారణకు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోంది. 'కొవిడ్ మేనేజ్‌మెంట్ ప్యాచ్' అనే ఈ కార్యక్రమ సాయంతో కింది కోర్టుల్లో రద్దీని నివారించవచ్చని చెబుతోంది.
కొవిడ్ ప్యాచ్
కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఐసీ) రూపొందించిన ఈ కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా కేసుల వర్గీకరణలో సహాయకారిగా ఉంటుంది. జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో కరోనా తీవ్రత పెరగకుండా చూసేందుకు ఇది దోహదపడుతుంది. సుప్రీంకోర్టు కమిటీ మార్గదర్శకత్వంలో పుణె ఎన్‌ఐసీ బృందం గతేడాది ఈ 'ప్యాచ్'ను అభివృద్ధి చేసింది.