కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది హోం మంత్రిత్వ శాఖ. కొవిడ్ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కరోనా కేసులలో నిరంతర క్షీణత ఉన్నా ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని... నిఘా, నియంత్రణ, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు.
జనవరి 31 వరకు కొవిడ్ మార్గదర్శకాల గడువు పొడిగింపు
కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా ఆంక్షలను పొడిగిస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
జనవరి 31 వరకు కొవిడ్ మార్గదర్శకాల గడువు పొడిగింపు
కంటైన్‌మెంట్ జోన్‌లను జాగ్రత్తగా గుర్తించడం కొనసాగుతుందన్న కేంద్ర హోంశాఖ.. వైరస్ ప్రభావం ఉన్న మండలాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. అనుమతి ఉన్న కార్యకలాపాలు కూడా నిబంధనలకు లోబడే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Last Updated : Dec 28, 2020, 7:31 PM IST