Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 11,793 మంది వైరస్ బారినపడగా.. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 9,486 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,418,839
- మొత్తం మరణాలు: 5,25,047
- యాక్టివ్ కేసులు: 96,700
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,97,092
Vaccination India: భారత్లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరో 4,73,717 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 366,742 మంది వైరస్ బారినపడ్డారు. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరింది. ఒక్కరోజే 533,455 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 525,515,504గా ఉంది.
- బ్రెజిల్లో కొత్తగా 58,278 కేసులు నమోదు కాగా.. 147 మంది మరణించారు.
- అమెరికాలో 52,403 కేసులు వెలుగుచూశాయి. 80 మందికిపైగా చనిపోయారు.
- తైవాన్లో 28,580 కొత్త కేసులు నమోదుకాగా.. 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీ ఒక్కరోజే 24,747 మంది కొవిడ్ బారినపడగా.. 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో ఒక్కరోజే 23,960 కొత్త కేసులు బయటపడగా.. 23 మంది మరణించారు.
ఇదీ చదవండి:దేశంలో భారీ దాడులకు ఉగ్రకుట్ర.. ఆ భక్తులే టార్గెట్.. హోంశాఖ హైఅలర్ట్!