INDIA COVID CASES: భారత్లో కరోనా మరణాలు భారీగా పెరిగాయి. కాగా కేసులు మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 2,226 కేసులు నమోదయ్యాయి. మరో 65మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,202 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు:43,105,551
- మొత్తం మరణాలు: 5,24,413
- యాక్టివ్ కేసులు: 14,955
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,97,003
Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 14,37,381 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,92,28,66,524కు చేరింది. ఒక్కరోజే 4,42,681 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 6,03,747మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 822 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,69,94,645కు చేరింది. మరణాల సంఖ్య 62,99,692కు చేరింది. ఒక్కరోజే 6,31,641 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,67,89,278గా ఉంది.
- ఆస్ట్రేలియాలో తాజాగా 46,628 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 40,232 కేసులు నమోదయ్యాయి. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్లో తాజాగా 39,001 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 44 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 28,383 కేసులు వెలుగుచూశాయి. 76 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 23,976 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొరియాపై కొవిడ్ పంజా:ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా మరో 1,86,090 మంది కరోనా బారినపడగా.. ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కు చేరుకుంది. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 26,46,730 మందికి కరొనా సోకగా.. 20,67,270 మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు, మరణాలు