దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దిల్లీలో సోమవారం కొత్తగా 89 కేసులు(Covid Cases) మాత్రమే నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు.
వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- కేరళలో కొత్తగా 10,905 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 12,351 మంది కోలుకోగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కొత్తగా 5,127 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. 7,159 మంది కోలుకోగా, 91 మంది మృతిచెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 9,974 కేసులు బయటపడ్డాయి. 8,562 మంది డిశ్చార్జ్ అవగా.. 143 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 3,604 కేసులు నమోదవగా.. 7,699 మంది డిశ్చార్జ్ అయ్యారు. 89 మంది మృతిచెందారు
- బంగాల్లో 1,836 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. 2,022 మంది కోలుకున్నారు. 29 మంది మృతి చెందారు.