Covid Cases In India: కేరళలో కొవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 15,184 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 427 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,96,247కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 62,053గా ఉంది.
కేరళలో భారీగా తగ్గిన కేసులు.. దిల్లీలో పాజిటివిటీ రేటు@1.68 - దేశంలో కొవిడ్-19 కేసులు
Covid Cases In India: కేరళలో కొవిడ్-19 కేసులు తగ్గాయి. కొత్తగా 15,184 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అటు కర్ణాటకలోనూ కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. తాజాగా 3,202 మందికి వైరస్ సోకింది. దిల్లీలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 1.68గా ఉంది.
కరోనా
కర్ణాటకలో కొత్తగా 3,202 మందికి వైరస్ నిర్ధరణ అయంది. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మరో 4,359 మందికి వైరస్ సోకింది. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 1.68గా ఉంది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
రాష్ట్రం | కేసులు | మరణాలు |
మధ్యప్రదేశ్ | 2,438 | 07 |
గుజరాత్ | 1,646 | 20 |
ఒడిశా | 1,439 | 24 |
దిల్లీ | 920 | 13 |
తమిళనాడు | 2,812 | 17 |
మిజోరాం | 1,822 | 01 |
హిమాచల్ ప్రదేశ్ | 409 | 04 |
జమ్ముకశ్మీర్ | 458 | 03 |
రాజస్థాన్ | 2,606 | 08 |