Covid Cases in India: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. కొవిడ్ హాట్స్పాట్ అయిన మహారాష్ట్రలో కొత్తగా 42,462 కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో గత రెండు రోజులతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు నచ్చాయి.
కర్ణాటకలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా 32వేల మందికిపైగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్క బెంగళూరులోనే 22,284 కేసులు బయటపడ్డాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 4273 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,69,850గా ఉంది.
ప్రాంతం | కొత్త కేసులు | మరణాలు |
మహారాష్ట్ర | 42,462 | 23 |
కర్ణాటక | 32,793 | 7 |
దిల్లీ | 20,718 | 30 |
తమిళనాడు | 23,989 | 11 |
బంగాల్ | 19,064 | 39 |
ఉత్తర్ప్రదేశ్ | 15,795 | 4 |
కేరళ | 17,755 | 17 |
ఒడిశా | 10,856 | 2 |
ముంబయి | 10,661 | 11 |
మధ్యప్రదేశ్ | 5,315 | - |
ఆంధ్రప్రదేశ్ | 4,955 | 1 |
జమ్ముకశ్మీర్ | 3,251 | 4 |
తెలంగాణ | 1,963 | 2 |
చండీగఢ్ | 1,795 | - |
ఒమిక్రాన్ కేసులు
కరోనా తీవ్రంగా ఉన్న కేరళలో కొత్తగా 48 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 528కు చేరింది. మరోవైపు ఒడిశాలో కొత్తగా 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒడిశాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 202కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 125 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,730కు పెరిగింది.