తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కట్టడిలో ఆ మూడు రాష్ట్రాల్లో లోపాలివే..! - కరోనా న్యూస్​

దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న 50జిల్లాలు కొవిడ్ నిబంధనల అమల్లో ఘోరంగా విఫలమైనట్లు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్‌లోని కరోనా ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన ద్రబృందాలు.. కొన్నిజిల్లాల్లో ఆర్​టీపీసీఆర్​ నిర్ధరణ కేంద్రాలు లేకపోవడం, కంటైన్‌న్మెంట్ చర్యలు తీసుకోకపోవడం, వైద్యసిబ్బంది కొరత వంటి సమస్యలను గుర్తించాయి.

COVID appropriate behaviour not being followed in 50 most-affected districts in 3 states: Govt
కరోనా కట్టడిలో ఆ మూడు రాష్ట్రాల్లో లోపాలివే..!

By

Published : Apr 12, 2021, 5:10 AM IST

కరోనా వైరస్‌ రెండో ఉద్ధృతితో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో వైరస్‌ విస్తృతి అనూహ్యంగా పెరిగింది. దీంతో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను మూడు రాష్ట్రాలకు పంపించింది. గత కొన్నిరోజులుగా మూడు రాష్ట్రాల్లో 50జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. ఆయా రాష్ట్రాల్లో వైరస్‌ కట్టడి కాకపోవడంలో వైఫల్యాలను గుర్తించాయి. కొన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ నిర్ధారణ కేంద్రాలు లేకపోవడం, కొవిడ్‌ కంటెయిన్‌మెంట్‌ చర్యలు తీసుకోకపోవడం, ఆరోగ్యసంరక్షణ సిబ్బంది కొరత వంటి కీలక సమస్యలను వెల్లడించాయి.

నిబంధనలకు దూరం..

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో దాదాపు 30జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. పలు జిల్లాల్లో కొవిడ్‌ శాంపిళ్లు భారీ స్థాయిలో పరీక్షించాల్సి రావడంతో ఫలితాలు ఆలస్యమవుతున్నట్లు కేంద్ర బృందాలు గుర్తించాయి. వీటికి తోడు స్థానిక ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం కూడా వైరస్‌ వ్యాప్తికి మరో కారణంగా అంచనా వేసింది. ఇక మరికొన్ని జిల్లాల్లో క్రియాశీల కేసులపై పర్యవేక్షణ లేకపోవడం స్పష్టంగా కనిపించినట్లు కేంద్ర బృందాలు నివేదించాయి. ముఖ్యంగా ఈ కారణాల వల్ల వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేయలేకపోతున్నట్లు నివేదించింది.

నిర్ధారణ పరీక్షలు తక్కువే..

మహారాష్ట్ర అనంతరం వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్‌ రెండో వరుసలో ఉంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో 80శాతానికి పైగా బ్రిటన్‌ రకానివే ఉన్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. అయినప్పటికీ ఇక్కడ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో పాటు, కొవిడ్‌ ఆసుపత్రులు కూడా లేవని కేంద్ర బృందాలు గుర్తించాయి. వీటికి తోడు అవసరమైన సంఖ్యలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు లేరని పేర్కొన్నాయి. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా పంజాబ్‌లో మందకొడిగా సాగుతున్నట్లు కేంద్ర బృందం గుర్తించింది. అయితే, పంజాబ్‌లో టీకాల కొరత ఉందని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

కంటెయిన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటులో నిర్లక్ష్యం..

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసుకోవడంలో ఛత్తీస్‌గఢ్‌ వెనుకబడిందని కేంద్ర నిపుణుల బృందం గుర్తించింది. అంతేకాకుండా అక్కడక్కడ ఆరోగ్యసంరక్షణ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. దీంతో అక్కడ కంటెయిన్‌మెంట్‌ చర్యలు తీసుకునేందుకు ఆటంకం ఏర్పడుతున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 63,294 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details