కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం(ఏప్రిల్ 22) నుంచి ఔట్ పేషంట్ సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సాధారణ ఇన్‌పేషంట్ సేవలనూ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
"ఔట్ పేషంట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. స్పెషాలిటీ క్లినిక్‌లు, అన్ని రకాల టెలీకన్సల్టేషన్ సేవలను గురువారం నుంచి నిలిపివేస్తాం. కరోనా సామాజిక వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కొవిడ్ బాధితులకు సత్వరమే చికిత్స అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దిల్లీలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించటం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం."
- దిల్లీ ఎయిమ్స్