తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ఫ్యూతో ఎడారిని తలపిస్తున్న అమరావతి - మహారాష్ట్రలో కొవిడ్ కేసులు

నిన్నమొన్నటి వరకు ప్రజలతో కళకళలాడే మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని వీధులు.. కర్ఫ్యూతో బోసిపోయాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా కేసులు భారీగా బయటపడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు అధికారులు.

COVID-19: Streets deserted during week-long curfew in Maharashtra's Amravati
కర్ఫ్యూతో ఎడారిని తలపిస్తున్న అమరావతి

By

Published : Feb 23, 2021, 3:59 PM IST

మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసుల విపరీతంగా పెరగడం వల్ల వివిధ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. దీంతో అమరావతి జిల్లాలో వీధులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. అధికారులు.. కట్టుదిట్టంగా నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావడం లేదు.

కర్ఫ్యూతో ఎడారిని తలపిస్తున్న అమరావతి

కర్ఫ్యూలో భాగంగా నిత్యావసర వస్తువుల దుకాణాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తున్నారు.

సోమవారం రాత్రి 8 గంటల నుంచి వివిధ జిల్లాల్లో కర్య్ఫూ విధించింది మహా ప్రభుత్వం.

నిర్మానుష్యంగా మారిన రహదారులు
బయటకు ఎందుకొచ్చారని వాహనదారులను ప్రశ్నిస్తున్న పోలీసులు
ఎడారిని తలపిస్తున్న రోడ్లు

ప్రస్తుతం రాష్ట్రంలో 54,306 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు 19,99,982మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. 51,806 మంది చనిపోయారని పేర్కొంది.

ఇదీ చూడండి:కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details