దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 41 వేల 810 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 93 లక్షల 92 వేల 920కి చేరింది. కొవిడ్ కారణంగా మరో 496 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 36వేల 696కు పెరిగింది.
దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 12లక్షల 83వేలకుపైగా నమూనాలను పరీక్షించారు. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 13కోట్ల 95లక్షలు దాటిందని భారత ఔషధ నియంత్రణ పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.