మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఐదు అంచెలుగా లాక్‌డౌన్ సడలింపులను అమలు చేయాలని.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న ఆంక్షలు జూన్ 15వరకు కొనసాగుతున్నప్పటికీ.. ఆ తర్వాత ఆంక్షల సడలించే వ్యూహాన్ని ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది. కొవిడ్ తీవ్రతను బట్టి రాష్ట్రంలోని జిల్లాలను ఐదు స్థాయులుగా వర్గీకరించిన ప్రభుత్వం.. వాటికి అనుగుణంగా ఆంక్షలను సడలిస్తామని తెలిపింది.
లెవెల్-1లో ఉన్న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో శుక్రవారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయనున్నారు. వైరస్ తీవ్రత అదుపులో ఉన్న లెవెల్-2 జిల్లాల్లో మాత్రం నలుగురు వ్యక్తుల కంటే ఎక్కువగా గుమిగూడకుండా సెక్షన్ 144ను అమలు చేస్తారు.
కర్ణాటకలో లాక్‌డౌన్ పొడగింపు..
రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్టున్నట్టు సీఎం యడియూరప్ప ప్రకటించారు. ప్రస్తుతం కొనసాతున్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 14 ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం పలువురు మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్టు గురువారం సాయంత్రం ప్రకటించారు.
ఇదీ చదవండి:బతుకు భారమై.. మెతుకు కరవై ఆటోకు నిప్పు!
ఇదీ చదవండి:కరోనాకు 'మందు'గా పవిత్రజలం- ఎగబడ్డ జనం