కొవిడ్ సోకిన గర్భిణుల్లో(Pregnant women covid) ఇన్పెక్షన్ ముప్పు ఎక్కువని, ఈ క్రమంలో వారికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గర్భిణుల్లో కరోనా ప్రతికూల ఫలితాలపై ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో అధ్యయనం జరిపింది. ఆ రాష్ట్రంలోని పలు ఇన్సిస్టిట్యూట్‌లు, ఆసుపత్రుల సహకారంతో ఐసీఎంఆర్ మొదటిసారిగా సమగ్ర అధ్యయనం జరిపింది. మహారాష్ట్రలో కొవిడ్ సోకిన గర్భిణులు(Pregnant women covid), బాలింతలపై సేకరించిన సమాచారంతో ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 4,203 మంది కరోనా సోకిన గర్భిణుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. మొత్తంగా చూస్తే.. 3,213 జననాలు, 77 గర్భస్రావాలు నమోదయ్యాయి. మొత్తం 528 మందికి ముందస్తు ప్రసవం అయింది. 328 మందిలో రక్తపోటు సమస్యలు తలెత్తాయి. పిండ విచ్ఛిత్తి, మృత శిశువుల జననం నిష్పత్తి ఆరు శాతంగా ఉంది.
534 మందిలో లక్షణాలు..