హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని ఎయిమ్స్ వైద్యులు సూచించారు. ఒక వేళ వారిలో ఆక్సిజన్ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆసుపత్రిలో చేరాలని తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎయిమ్స్ వెద్యులు వెబినార్ నిర్వహించారు.
"ఇంటివద్ద రెమ్‌డెసివిర్ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి."
-డాక్టర్ నీరజ్ నిశ్చల్, ఎయిమ్స్