దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా దిల్లీలో భారీగా నమోదవుతున్నాయి. దీంతో చొరవ తీసుకున్న కేంద్రం... కొవిడ్ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలిచ్చే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ల సంఖ్యను పెంచింది. ఫలితంగా తొలిసారి యాంటిజెన్ పరీక్షల కంటే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను ఎక్కువగా నిర్వహించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంటింటి సర్వే జరిపి 3.7 లక్షల మందిని పరీక్షించినట్లు పేర్కొంది.
కరోనా నివారణకు ముమ్మర చర్యలు
- రాజధాని ప్రాంతంలో కొవిడ్ నివారణలో భాగంగా 3.7 లక్షల మందిని సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు.
- 250 వెంటిలేటర్లను డీఆర్డీఓ ఆసుపత్రికి అందించినట్లు పేర్కొన్నారు.
- దిల్లీ ఎయిమ్స్ కూడా 207 మంది జూనియర్ రెసిడెంట్ డాక్టర్లను నియమించే ప్రక్రియను మొదలుపెట్టింది.